![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు.
ఇప్పటివరకు ఉన్నవారిలో ఎవరు టాప్-5 లో ఉంటారు. ఎవరు విజేతగా నిలుస్తారు. ఎవరేంటో ఓసారి చూసేద్దాం. తనూజకి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. అందుకే తను ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా తనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి ఉంటున్నాడు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ , డీమాన్ పవన్ కి ఓ మోస్తారు ఓటింగ్ బజ్ అయితే ఉంది. అయితే వీళ్ళంతా నామినేషన్ లో ఉన్నప్పుడు హౌస్ లో గేమ్ ఆడితేనే ఓట్లు పడతాయి. కానీ ఇమ్మాన్యుయల్ కి మాత్రం ఎవరున్నా లేకున్నా ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే అతనే హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేది. గేమ్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కాస్త సరదాగా నవ్వుతూ ఉండాలంటే అక్కడ ఇమ్మాన్యుయల్ పంచ్ లు డైలాగులు ఉండాల్సిందే అన్నట్టుగా ఈ సీజన్-9 సాగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ సిచువేషన్ లో ఉన్నా వారిని నవ్విస్తాడు ఇమ్మాన్యుయల్. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలు.. ఇలా బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇమ్మాన్యుయేల్.
తాజాగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ చేసే కామెడీకి వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. ఇమ్మాన్యుయల్ మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా నేచురల్ గా కనిపిస్తున్నాడు. తోటి కంటెస్టెంట్స్ తోనూ ఎంతో కలివిడిగా ఉంటున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు హౌస్ లోని టాస్క్ లలో కూడా ఇరగదీస్తున్నాడు. తన వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడుతున్నాడు. అందుకే అతనికి గోల్డ్ స్టార్ కూడా వచ్చింది. గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయల్.. కేవలం 500 రూపాయలతో ఊరి నుండి సిటీకి వచ్చి ఆడిషన్ లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్మాన్యుయల్.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతడి కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత షోలలో కామెడీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. దాంతో బిగ్ బాస్ సీజన్-9 లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో తమూజతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ తో ఇమ్మాన్యుయల్ చేసే కామెడీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక హౌస్ లో పదహారు మంది ఉండగా వారిలో బెస్ట్ ఎవరంటే మాత్రం ఫస్ట్ ఇమ్మాన్యుయల్ కన్పిస్తాడు. దీన్ని బట్టి చూస్తే .. ఇమ్మాన్యుయల్ ఈ సీజన్-9 విజేతగా నిలవడం ఖాయమనిపిస్తోంది. ఇమ్మాన్యుయల్ మొదటి స్థానంలో, తనూజ రెండవ స్థానంలో, సుమన్ శెట్టి మూడో స్థానంలో ఉంటారని ఇన్ని వారాల ఓటింగ్ ని బట్టి చూస్తే తెలుస్తోంది. మరి టాప్-3 లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.
![]() |
![]() |